E.G: విద్యా నగర్లో లో వోల్టేజీ సమస్య పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫారమ్‌ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఇప్పటి వరకు 98 ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, మరో 30 ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.