ఏలూరు: చింతలపూడి వ్యవసాయం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్గా చీదరాల దుర్గా పార్వతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించి శాలువతో ఘనంగా సత్కరించారు. అలాగే ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.