ATP: మహిళల హక్కుల సాధనకు నిరంతరం మహిళా సమాఖ్య కృషి చేస్తోందని సమాఖ్య గుంతకల్ నియోజకవర్గం కార్యదర్శి మహబూబా పేర్కొన్నారు. బుధవారం గుత్తి సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య 70వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, మద్యపాన నిషేధం అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.