AKP: ప్రతీ హిందూ పండగలో ఓ పరమార్ధం దాగి ఉంటుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. నాగుల చవితి పండగ సందర్భంగా అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో జాజులమ్మ తల్లి ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా జాజులమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. నాగుల చవితి పర్వదినం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.