సత్యసాయి: ముదిగుబ్బలో గనులు, భూగర్భ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిరంతరం నిఘా ఉంచుతామని గనుల శాఖ ఏడీ అమీర్ బాషా స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో రాయల్టీ ఇన్స్పెక్టర్ ఖాజావాలి పాల్గొన్నారు.