అన్నమయ్య: మదనపల్లెలో కిడ్నీ రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మదనపల్లె SBI కాలనీలోని గ్లోబల్ హాస్పిటల్ యజమాని, అన్నమయ్య జిల్లా DCHS డా. ఆంజనేయులు, మరో వైద్యుడు, విశాఖకు చెందిన పద్మ, కాకర్ల సత్య, సూరిబాబు, అలాగే మదనపల్లె-కదిరి డయాలసిస్ మేనేజర్లు బాలరంగబాబు, మెహరాజ్లపై బుధవారం పోలీసులు హత్య మరియు మానవ అవయవాల అక్రమ రవాణా కేసులు నమోదు చేశారు.