NDL: గడివేముల మండల పరిధిలోని పెసరవాయి, కరిమద్దెల గ్రామాలలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్రెడ్డి నిర్వహించారు. రైతులతో మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన దిగుబడిని ఎలా సాధించవచ్చో వివరించారు. సాగులో సాంకేతిక పద్ధతులు ఉపయోగించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.