NDL: దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీశైలంలో సోమవారం రాత్రి సికింద్రాబాద్ నగరానికి చెందిన కీర్తి ఆర్ట్స్ అకాడమీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. మహాగణపతిం, శివతాండవం, కాలభైరవాష్టకం, తదితర గీతాలకు కళాకారులు ప్రశాంతి, హర్షిక, సుచిత, స్వాతి, అక్షయ తదితరులు నృత్యాలు ప్రదర్శించారు.