ప్రకాశం: ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ నందు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కళాకారులు నడుంబిగించారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కోసం మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ… వరద బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. అనంతరం జబర్దస్త్ అప్పారావును సన్మానించారు.