CTR: రొంపిచర్ల మండలం బజార్ వీధిలో ఉన్న జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు నిర్మల అమర్నాథ్ అనే పూర్వ విద్యార్థి ప్రింటర్, జిరాక్స్, స్కానింగ్ మిషన్లను సోమవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను 1983- 84 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షను ఇక్కడ అభ్యసించానని పేర్కొన్నారు. తన వంతుగా సహాయ సహకారం అందించినట్లు తెలిపారు.