VZM: పైడిమాంబ పండగ సందర్బంగా జొన్నాడ వద్ద టోల్ ప్లాజా వసూళ్లు ఆపాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి కోరారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విజయనగరం శ్రీపైడిమాంబ ఉత్సవాలు ముగిసినంత వరుకు టోల్ ప్లాజా వసూళ్లు చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు.