»Rashmika Mandanna Says She Touches Her House Helps Feet Daily
Rashmika Mandanna: పని మనిషి పాదాలు మొక్కుతానన్న రష్మిక మందన్న
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందాన్న తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. 2016లో సినిమాల్లోకి అడుగు పెట్టిన రష్మిక చలో సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలు చేసింది. గుడ్ బై, మజ్ను వంటి సినిమాలతో హిందీలో స్థిరపడింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందాన్న తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. 2016లో సినిమాల్లోకి అడుగు పెట్టిన రష్మిక చలో సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. గీత గోవిందంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలు చేసింది. గుడ్ బై, మజ్ను వంటి సినిమాలతో హిందీలో స్థిరపడింది. రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది ఈ ఏడాది చివరలో విడుదల కానుంది. రష్మిక తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానుల మన్ననలు పొందుతోంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న రష్మిక డౌన్ టు ఎర్త్ కనిపిస్తోంది. పద్ధతులు, విలువలు మనం ఏమిటనేది సమాజానికి తెలియజెప్పుతాయని అంటోంది. తాను ప్రతి రోజు తన పని మనిషి కాళ్లు మొక్కుతానని చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అంశాల గురించి చెప్పి, నిజ జీవితంలోను ఔరా అనిపించింది.
మనుషుల మధ్య విబేధాలు, హెచ్చుతగ్గులు చూడటం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఏ చిన్న విషయం అయినప్పటికీ తాను అంత సులువుగా వదిలి పెట్టనని, నిద్ర లేవగానే పెంపుడు జంతువులతో సమయం గడుపుతానని చెప్పింది. తరుచూ స్నేహితులను కలుస్తానని, అలా చేస్తేనే తనకు సంతోషంగా ఉంటుందని వెల్లడించింది. మనం ఏం మాట్లాడినా విలువైనదిగా ఉండాలని, తాను అలాగే మాట్లాడుతానని చెప్పింది. అనవసరమైన విషయాలు, మాటలతో కొన్ని బంధాలు ఏర్పడితే, కొన్ని తెగిపోతాయని చెప్పింది. తనకు డైరీ రాసుకునే అలవాటు ఉన్నదని చెప్పింది. బయట నుండి ఇంటికి వెళ్లగానే పని మనిషితో పాటు ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతానని చెప్పింది. అందరి పైన గౌరవంతో పని చేస్తానని, ఎవరినీ వేరు చేసి చూడనని చెప్పింది.