సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు లైంగిక వేధింపులు కొత్తేమి కాదు. చాలా ఏళ్ల నుంచి ఇది కొనసాగుతున్న తంతే. అయితే ఆ మధ్య శ్రీరెడ్డి లైంగిక వేధింపులపై పోరాటం చూసిన తరువాత చాలామంది హీరోయిన్స్ బయటకు వచ్చి, ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పడం జరిగింది. టాలీవుడ్ (Tollywood),బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పలేదు. తాజాగా హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) కూడా తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఓ ఇంటర్య్వూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేసింది. గతంలో ఓ టాలీవుడ్ హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. అస్తమానం డేట్ కి వెళదామా అని వేధించేవాడు చైల్డ్ ఆర్టిస్ట్ (child artis) గా కెరీర్‌ను మొదలుపెట్టిన హన్సిక .. కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కాని అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు(Desmuduru)’ సినిమాతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
2007, జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించారు .బాక్సాఫీస్ వద్ద ‘దేశముదురు’ సూపర్ హిట్‌గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ‘దేశముదురు’ సినిమా తరువాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి ఈ మోడల్లో బట్టలు నాకు చేయిస్తారా అని అడిగితే ..వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్లని తెలిపింది. కాని నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అన్నవాళ్ళే ఇప్పుడు నాకోసం డిజైనర్లు(Designers)గా పనిచేయడానికి ఎగబడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.ఆ హీరో వస్తావా అంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడు ఈ సమయంలోనే ఇండస్ట్రీ(Industry)లో తనకు ఎదురైనా వేధింపుల గురించి కూడా వెల్లడించింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని ఈ అమ్మడు తెలిపింది. ఆ హీరో పేరు మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ హీరో ఎవరా అని తెగా ఆరా తీస్తున్నారు నెటిజన్లు.