»Actress Samantha Trolls English Accent At London Premiere Of Citadel
Samantha ఇంగ్లీష్ యాషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
నటి సమంత ‘సిటాడెల్’ ప్రమోషన్ షో చూసిన తర్వాత లండన్‌లో మీడియాతో మాట్లాడారు. అక్కడి ఇంగ్లీష్ స్లంగ్లో మాట్లాడగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెటిజన్లు ఆమెను ఏకీపారేస్తున్నారు.
Actress Samantha trolls english accent at london premiere of Citadel
Samantha english accent:అమెరికన్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’ (Citadel) ప్రీమియర్ షో కోసం నటి సమంత లండన్ (london) వెళ్లారు. లండన్‌లో షో చూసిన తర్వాత సమంత (samantha) మీడియాతో మాట్లాడారు. ఎప్పటిలాగా ఇండియన్ ఇంగ్లీష్‌లో మాట్లాడలేదు. పాశ్చాత్య ఇంగ్లీష్ యాషలో మాట్లాడింది. దీంతో ఆమె ట్రోల్‌కు (troll) గురవుతున్నారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతుంది. నెటిజన్లు (netizens) తెగ కామెంట్లు చేస్తున్నారు. సిటాడెల్లో హిందీ వెర్షన్లో రిచర్డ్ మాడెన్‌తో కలిసి సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఆ వీడియోలో సమంత కేవలం 13 సెకన్లు (13 seconds) మాట్లాడారు. లండన్ ఇంగ్లీష్‌లో.. పాష్‌గా మాట్లాడారు. దీంతో నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. సమంత అప్పుడే హలీవుడ్ (hollywood) రేంజ్ హీరోయిన్ మాదిరిగా ఫీల్ అవుతుందని రాశారు. ఆమె మాటలు ఊహిస్తేనే భయంకరంగా ఉందని కమెడీయన్ బ్రహ్మానందం ఫోటో పెట్టి మరీ షేర్ చేశారు.
పట్టుమని 10 కోట్లు (10 crores) కూడా కలెక్షన్ తెచ్చుకోలేదని.. హలీవుడ్ హీరోయినా అని మరొకరు రాశారు. ఇటీవల విడుదలయిన సమంత శాకుంతలం మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఆ మూవీని ఇండైరెక్టుగా ప్రస్తావించారు. మరొకరు మెనేజ్ మెంట్ కన్సల్టింగ్‌కు వెళితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
తెలుగులో (telugu) దిక్కులేదు కానీ హలీవుడ్ పోతాదంట ఈమె అంటూ మరొకరు రాశారు. మై నేమ్ ఈజ్ SaMannnnthaa అని పేర్కొన్నారు. సమంత యాష ప్రకారం ఎక్కువ ఎన్, ఏ అనే అక్షరాలు పెట్టి కామెంట్ చేశారు. ఇలా మెజార్టీ నెటిజన్లు విమర్శించారు.
కొందరు మాత్రం ఏం ఫర్లేదు.. అక్కడి స్లంగ్ ప్రకారం మాట్లాడిందని సర్దుకున్నారు. కామెంట్ చేసేవారు విమర్శించడం మానుకోవాలని సూచించారు. సిటాడెల్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని, అద్భుతం అని సమంత మాట్లాడారు. బ్రిటన్ ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై నెటిజన్లు కామెంట్స్ చేశారు.