కోలీవుడ్ యాక్షన్ హీరోగా పాపులర్ అయిన స్టార్ హీరో విజయకాంత్ పరిస్థితి దయనీయంగా ఉంది. అనారోగ్యంతో ఆయన నడవలేని స్థితికి చేరారు. ఒకప్పుడు కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. రజినీ కాంత్, కమల్ హాసన్ సినిమాలతో పాటు విజయకాంత్ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడేవారు. విజయకాంత్ ఖాతాలో భారీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.
పవర్ ఫుల్ పోలీసు పాత్రలకు ఆయన కేరాఫ్ గా నిలిచారు. 2005లో ఆయన డిఎండికే పేరుతో పొలిటికల్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ తో బాధపడుతున్న ఆయనకు గతంలో మూడు కాలు వేళ్లను తొలగించారు. ఒకటి రెండు సార్లు ఆయన విషమ పరిస్థితిలోకి వెళ్లి ఆస్పత్రిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతగా బాగోలేదని, నడవలేసి స్థితికి విజయకాంత్ చేరుకున్నట్లు సమాచారం. విజయకాంత్ ను అందరూ కెప్టెన్ అంటూ పిలుస్తారు. ఇప్పుడు కెప్టెన్ పరిస్థితిని చూసి అందరూ బాధను వ్యక్తం చేస్తున్నారు.