Sudigali Sudheer: ‘కాలింగ్ సహస్త్ర’ నుంచి ‘కలయా నిజమా’ సాంగ్ రిలీజ్
కాలింగ్ సహస్త్ర సినిమా హీరో సుధీర్ మాట్లాడుతూ మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని, చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కు వచ్చినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) అటు బుల్లితెరపై ఇటు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోతున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్త్ర’ అనే మూవీ (Calling Sahasra) తెరకెక్కుతోంది. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీకి అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈమూవీ నుంచి ‘కలయా నిజమా’ అనే లిరికల్ సాంగ్(Kalaya Nijama Lyrical Song Release)ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘కాలింగ్ సహస్త్ర’ నుంచి లిరికల్ సాంగ్:
కె.ఎస్.చిత్ర(K.s.chitra) మాట్లాడుతూ..‘కాలింగ్ సహస్త్ర’(Calling Sahasra) ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అని అన్నారు. ఈ సినిమాలో ‘కలయా నిజమా’ అనే మెలోడి సాంగ్ పాడినట్లు వీడియో ద్వారా తెలిపారు. లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ..మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ అద్భుతమైన మ్యూజిక్ అందించారన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ..కలయా నిజమా సాంగ్ పాడేటప్పుడు చిత్రకు ఆరోగ్యం బాలేదని, అయినా ప్రాక్టీస్ చేసి పాడినట్లు తెలిపారు.
నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ..నిర్మాతలుగా తమకు ‘కాలింగ్ సహస్త్ర’(Calling Sahasra) తొలి సినిమా అని అన్నారు. ఈ సినిమా కోసం నటీనటులంతా ఎంతో కష్టపడినట్లు తెలిపారు. కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు ఈ షూటింగ్ ను కష్టపడి పూర్తి చేసినట్లు తెలిపారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ..కథ వినగానే నవల చదివినంత ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ గుడ్ లక్ చెప్పారు.
చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా(Director Arun Vikkiraalaa) మాట్లాడుతూ.. ఈ పాటను చిత్ర పాడిన తర్వాత మరింత అందం వచ్చిందన్నారు. సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. ఈ మూవీలో బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయన్నారు. హీరో సుధీర్ మాట్లాడుతూ..మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని, చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కు వచ్చినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.