గత కొన్ని రోజులుగా హిట్ కోసం చూస్తున్న హీరోయిన్లలో అవికా గోర్ కూడా ఉంది. తాజాగా ఆమె ‘పాప్ కార్న్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో ఆమెకు జోడిగా సాయిరోనక్ నటిస్తున్నాడు. ఓ షాపింగ్ మాల్ లోని లిఫ్ట్ లో ఇద్దరు చిక్కుకుంటారు. ఆ యువతీ యువకుల ప్రేమ కథే ఈ సినిమా.
భోగేంద్రనాథ్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి మురళీ గంధం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 10వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.