Samantha-Nikhil : సమంతతో నిఖిల్.. పాన్ ఇండియా పోటీ !?
Samantha-Nikhil : ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది. స్టార్ బ్యూటీ సమంత, యంగ్ హీరో నిఖిల్ సినిమాలు పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో అల్లరి నరేష్ 'ఉగ్రం', సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' వంటి సినిమాలు ఉన్నా.. సమంత, నిఖిల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది. స్టార్ బ్యూటీ సమంత, యంగ్ హీరో నిఖిల్ సినిమాలు పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో అల్లరి నరేష్ ‘ఉగ్రం’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ వంటి సినిమాలు ఉన్నా.. సమంత, నిఖిల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నాయి. అందుకే ఇద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. యశోద సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న సమంత.. ఇప్పుడు శాకుంతలంగా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. గుణశేఖర్ దర్శకతక్వంలో తెరకెక్కిన శాకుంతలం.. పలు వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేకుందు రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ కూడా అదే రోజు తన కొత్త సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత 18 పేజేస్తో పర్వాలేదనిపించాడు. అందుకే ఇప్పుడు.. ‘స్పై’ అనే చిత్రంతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపాలని చూస్తున్నాడు.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీ హెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘స్పై’ సినిమాను.. ఏప్రిల్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అదికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపుగా ఇదే డేట్ లాక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దాంతో నిఖిల్‌కు సమంతతో పోటీ తప్పేలా లేదంటున్నారు. మరి నిఖిల్ సామ్‌తో సై అంటాడా.. లేదంటే మరో డేట్‌ను వెతుక్కుంటాడో చూడాలి.