Ram Charan : సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సానా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. అయితే ఉప్పెన సినిమాతో మెగాఫోన్ పట్టిన బుచ్చిబాబు.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బుచ్చిబాబుకి భారీ ఆఫర్స్ తలుపు తట్టాయి.
సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సానా ఇండస్ట్రీలో అందరికీ పరిచయమే. అయితే ఉప్పెన సినిమాతో మెగాఫోన్ పట్టిన బుచ్చిబాబు.. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బుచ్చిబాబుకి భారీ ఆఫర్స్ తలుపు తట్టాయి. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఛాన్స్ కొట్టేశాడు. ఎన్టీఆర్ కోసం దాదాపు రెండేళ్లు వెయిట్ చేశాడు. కానీ అప్పటికే తారక్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో కమిట్ అయ్యాడు. అందుకే ఎన్టీఆర్ తన క్లోజ్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్ చేశాడు. దాంతో రెండో సినిమానే పాన్ ఇండియా హీరోతో ఛాన్స్ కొట్టేశాడు బుచ్చిబాబు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం చరణ్ శంకర్ ఆర్సీ15తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే బుచ్చిబాబు ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాడు. ఇదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఫిబ్రవరి 15న, అంటే ఈ రోజు బుచ్చిబాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. దాంతో బుచ్చిబాబుకి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేసాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా.. త్వరలో సెట్స్‌లో కలుద్దాం.. అని రాసుకొచ్చాడు చరణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నుకున్న దానికంటే ముందే ఆర్సీ 16 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చరణ్ రెమ్యూనరేషనే 100 కోట్లకుపైగా ఉంటుందని అంటున్నారు. మరి పాన్ ఇండియా హీరోని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.