Mega Star Chiranjeevi & Bala Krishna : చిరు, బాలయ్య మధ్యలో పూరి.. కానీ ఇది ఫిక్స్!
Mega Star Chiranjeevi & Bala Krishna : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. లైగర్ దెబ్బకు పూరికి ఛాన్స్ ఇచ్చే హీరోలే లేరని ప్రచారం జరుగుతోంది. కానీ చిరు, బాలయ్య మాత్రం పూరికి మాటిచ్చేశారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరితో పూరి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్యతో ఫిక్స్ అయిపోయింది.. చిరుతో కూడా లాక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో క్లారిటీ రావడం లేదు. లైగర్ దెబ్బకు పూరికి ఛాన్స్ ఇచ్చే హీరోలే లేరని ప్రచారం జరుగుతోంది. కానీ చిరు, బాలయ్య మాత్రం పూరికి మాటిచ్చేశారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరితో పూరి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం బాలయ్యతో ఫిక్స్ అయిపోయింది.. చిరుతో కూడా లాక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. దాంతో ఏంటీ కన్ఫ్యూజన్ అంటున్నారు నెటిజన్స్. అయితే బాలయ్యతో ఎప్పుడుంటుందో చెప్పలేం గానీ.. మెగాస్టార్‌తో మాత్రం దాదాపుగా ఓకే అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్‌తో వెంకీ కుడుములతో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ చాలాకాలంగా నానుతూ వస్తోంది. ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కానీ పూరికి మాత్రం చిరు ఛాన్స్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య ఒకసారి స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, ఆల్మోస్ట్ ఈ కాంబో ఫిక్స్ అనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అంతేకాదు అతి త్వరలో అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోది. అయితే ఇప్పటి వరకు పూరి, చిరు నుంచి ఎలాంటి హింట్ లేదు. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ టైంలో.. పూరిని స్టోరీ రెడీ చేయమని చెప్పాడు చిరు. దాంతో ఆటోజానిని పక్కకు పెట్టి.. అదిరిపోయే కథ రాస్తానని చెప్పాడు పూరి. అప్పటి నుంచి చిరు, పూరి కాంబో తెరపైకి వస్తునే ఉంది. మరి ఈసారైనా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.