PawanKalyan: OG కోసం పవర్ ఫుల్ ఫాదర్.. ఎవరో తెలుసా!?
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాల్లో అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై.. అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది 'బ్రో' మూవీ. జూలై 28న 'బ్రో' సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఓజిని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. తాజాగా ఈ సినిమాలో పవన్ ఫాదర్‌గా అమితాబ్‌ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
పవన్(PawanKalyan) కమిట్ అయిన సినిమాల్లో.. హరిహర వీరమల్లు సంగతి పక్కన పెడితే.. మిగతా సినిమాలు మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అందుకే వీలైనంత వేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తున్న ఈ సినిమాను.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ముంబై గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఓజి తెరకెక్కుతోంది. దాంతో ఈ సినిమాలో పవర్ స్టార్(PawanKalyan) తండ్రిగా ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. పవన్ ఫాదర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. అందుకే.. ఆ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దింపుతున్నట్టు టాక్. ఇప్పటికే మూవీ మేకర్స్ బిగ్ బిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇంకా అమితాబ్ డెసిషన్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు అమితాబ్ బచ్చన్. దాంతో ఓజికి కూడా అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమంటున్నారు. దీంతో ఓజి పై మరింత వెయిట్ పెరగనుందని చెప్పొచ్చు. ఇకపోతే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పవన్(PawanKalyan) లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్ షెడ్యూల్లో ఇమ్రాన్ హష్మిపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్‌ని జూలై 9 నుంచి స్టార్ట్ చేయనున్నారట.