జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తూర్పు గోదావరి జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా పవన జనసేనాని పర్యటన సాగనుంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలిసి పవన్ పరామర్శిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్, లాలాచెరువు, బొమ్మూరు సెంటర్, రాజవోలు మీదుగా కడియం ఆవలో జనసేన నేతల పర్యటన సాగుతోంది.
జనసేన పార్టీ చేసిన ట్వీట్:
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.#JSPWithAPFarmers
ఆవ భూముల కారణంగా రైతులు తీవ్రంగా పంటలను నష్టపోయారు. రైతులను పరామర్శించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదటగా రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చి అక్కడి నుంచి వేమగిరి, జొన్నాడ, కొత్తపేట మీదుగా అవిడి చేరుకుని పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. వర్షం వల్ల మొలకలు వచ్చిన ధాన్యాన్ని పవన్ పరిశీలించారు.
జనసేన షేర్ చేసిన వీడియో:
రాత్రికి రాత్రి @PawanKalyan గారు వస్తున్నారని ఒక 2 లారీలు పంపి తడిచిన ధాన్యాన్ని కొంటున్నమని ప్రభుత్వం చెబుతోంది. ఇది సరైన పద్దతి కాదు, ప్రతీ గింజా కొంటాం అన్నారు, ఎందుకు కొనట్లేదు @YSRCParty ప్రభుత్వం – కడియం గ్రామ రైతు ఆవేదన#JSPWithAPFarmerspic.twitter.com/7zkxyynDd7
— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 10, 2023
ఈ సందర్భంగా జనసేన ట్వీట్ చేసింది. రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వస్తున్నారని రెండు లారీలు పంపి తడిచిన ధాన్యాన్ని కొంటున్నట్లు ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది సరైన పద్ధితి కాదని, ప్రతి గింజా కొంటామని, వైసీపీ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో(Video)ను జనసేన పార్టీ(Janasena Party) తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది.