»Megastar Chiranjeevi Giving Birth To A Baby Girl On Tuesday Was Incredible
Megastar Chiranjeevi: మంగళవారం పాపకు జన్మనివ్వడం ఎంతో అపురూపం
మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంట సందడి నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan), ఉపాసన(Upasana) దంపతులకు పాప పుట్టడంతో మెగా కుటుంబ సభ్యులు(Mega Family), స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున రామ్ చరణ్ దంపతులకు పాప(Baby Girl) పుట్టింది.
మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్చరణ్(Ramcharan), ఉపాసన(Upasana) దంపతులకు పాప పుట్టిందని తెలిపారు. తమ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. పెద్దలు పాప పుట్టిన ఘడియలు మంచివంటున్నారని, ఆ ప్రభావం ముందు నుంచి తమకు తెలుస్తోందన్నారు.
ఈ మధ్య కాలంలో చరణ్(Ramcharan) ఎదుగుదల, తను సాధించిన విజయాలు, ఆ తర్వాత వరుణ్ తేజ్ నిశ్చితార్థం, ఇలాంటివన్నీ చూసుకుంటే తమ ఇంట్లో శుభకార్యాలే జరుగుతున్నాయని, వాటన్నింటిపై బిడ్డ ప్రభావం కూడా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తమ కుటుంబం ఆంజనేయస్వామినే నమ్ముకుని ఉందని, ఆయనకు సంబంధించిన మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు. అపోలో(Apollo)లో బెస్ట్ టీమ్ పర్యవేక్షణలో చాలా సుఖంగా ప్రసవం జరిగిందని, అందరికీ మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.