Selfish Movie: మే 1న ‘సెల్ఫిష్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల
నిర్మాత దిల్ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ తన రెండో చిత్రం సెల్ఫిష్(Selfish) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ఆశిష్ పాతబస్తీ కుర్రాడిగా మాస్ లుక్(Mass Look)లో కనిపించనున్నాడు.
రౌడీబాయ్స్ సినిమా(Rowdy boys Movie)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ఆశిష్(Hero Ashish). ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ తన రెండో చిత్రం సెల్ఫిష్(Selfish) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీలో ఆశిష్ పాతబస్తీ కుర్రాడిగా మాస్ లుక్(Mass Look)లో కనిపించనున్నాడు. యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సుకుమార్(Sukumar) శిష్యుడు కాశీ విశాల్(Kaashi Vishaal) దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు(Dil Raju), శిరీష్(Shirish) ఈ మూవీని నిర్మిస్తున్నారు. మే 1వ తేదిన ఆశిష్(Hero Ashish) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దిల్ ఖుష్ (Dil Khush)అనే తొలి లిరికల్ వీడియో సాంగ్ (Lyrical Video Song)ను రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత, గీత రచయిత అయిన చంద్రబోస్(Chandrabosh) ఈ సినిమాలోని దిల్ ఖుష్ పాటకు సాహిత్యం అందించారు.
సెల్ఫిష్ సినిమా(Selfish Movie)కు మిక్కి.జే.మేయర్ మ్యూజిక్(Mikhy J mayor) అందిస్తున్నారు. సాంగ్ రిలీజ్(Song Release) సందర్భంగా చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేయనుంది. పోస్టర్ లో ఆశిష్(Hero Ashish) మాస్ లుక్ లో కనిపించనున్నాడు. నేటి యువతరానికి నచ్చే విధంగా ఈ మూవీలో ఆశిష్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో లవ్ టుడే హీరోయిన్ ఇవానా(Ivana) నటిస్తోంది.