పల్సర్ బైక్ ఝాన్సీ(Pulsar Bike Jhansi) హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, ప్రత్యూష, ప్రశ్నిస్తా లాంటి సినిమాలతో పాటుగా 52 సినిమాలను నిర్మించిన సత్యారెడ్డి(Satyareddy) కథానాయకుడిగా వస్తోన్ని సినిమా ఉక్కు సత్యాగ్రహం( Ukku Satyagraham Movie). ఈ మూవీ స్టీల్ ప్లాంట్(Steelplant) నేపథ్యంలో రూపొందుతోంది. జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీ విశాఖలోని ఆర్కే బీచ్, ఆంధ్రా యూనివర్సిటీ, రామానాయుడు స్టూడియోలో షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.
ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) ఉక్కు సత్యాగ్రహం మూవీ( Ukku Satyagraham Movie)లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పల్సర్ బైక్ ఝాన్సీ(Pulsar Bike Jhansi) హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ప్రసన్న కుమార్, వైజాగ్ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వంటివారు ఈ మూవీలో నటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్(Steelplant) సాధణ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంతో ఈ మూవీ రూపొందుతోందని సత్యారెడ్డి(Satyareddy) తెలిపారు.
ఈ సినిమాలో యూనియన్ లీడర్లు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు స్వచ్ఛందంగా నటించారన్నారు. ఈ సినిమా కోసం గద్దర్(Gaddar), గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన పాటలు అందించారన్నారు. త్వరలోనే ఉక్కు సత్యాగ్రహం సినిమా( Ukku Satyagraham Movie) ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యక్తి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.