హలో బ్రదర్ షూటింగ్ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు నెలలు ఏ షూటింగ్‌కు వెళ్లకుండా అమలతోనే ఉన్నాని టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) అన్నారు. ఆమె ప్రసవించేంత వరకు కూడా ఆమెతోనే ఉన్నాను. ఆఖరికి డెలివరీ రూమ్‌లో కూడా ఆమె చేయి పట్టుకు నేను ఉన్నాన్నారు. నా జీవితంలో చాలా మంచి అనుభవం ఉందంటే అదే అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక నాగార్జునకి ఇటీవల మంచి సక్సెస్ లు రావడం లేదు. అలానే ఆయన కొడుకులు కూడా ఫ్లాపులు చవి చూస్తున్నారు. త్వరలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7)హోస్ట్‌గా అలరించనున్నాడు. ఆమె ప్రసవించేంత వరకు కూడా ఆమెతోనే ఉన్నాను.
ఆఖరికి డెలివరీ రూమ్‌లో కూడా ఆమె చేయి పట్టుకు నేను ఉన్నాను. నా జీవితంలో చాలా మంచి అనుభవం ఉందంటే అదే అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సోహైల్ (Sohail) తాజా చిత్రం మిస్టర్ ప్రగ్నెంట్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రీసెంట్గా జరగగా, ఆ కార్యక్రమంకి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక నాగ్ మాట్లాడే సమయంలో యాంకర్ మంజూష ఒక విచిత్రమైన ప్రశ్న అడిగింది. ‘ఆగస్టు 18న డెలివరీ కాబోతోంది కాబట్టి.. మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? పుట్టే బిడ్డకు ఏం పేరు పెడతారు?’ అని నాగార్జునని మంజూష ప్రశ్నించారు. వెంటనే నాగార్జున.. ‘ఎవరికి డెలివరీ అనగానే అప్పుడు ‘మిస్టర్ ప్రెగ్నెంట్(Mr. Pregnant)కి సార్’ అని మంజూష సమాధానం ఇచ్చారు.
దీంతో అక్కడ నవ్వులు పూయగా, వెంటనే నాగ్.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌కి హిట్టు పుట్టాలి’ అని అన్నారు.ఇక బిగ్ బాస్ షోలో సోహెల్ ప్రవర్తన నాకింకా కళ్ల మెదలుతూనే ఉంటుంది.ఎంతో కష్టపడి పైకి వచ్చిన సోహెల్ మిస్టర్ ప్రగ్నెంట్ చేయగా, ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక మగవాడు గర్భం దాల్చడం అనే కాన్సెప్ట్ నన్ను కూడా ఎంతో ఆశ్చర్యపరచిందని, ఈ సినిమా చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని నాగ్ అన్నారు. ఇక అమ్మతనం గురించి మాట్లాడిన నాగార్జున.. ‘మదర్‌హుడ్(Motherhood) అనేది చాలా అందమైన అనుభూతి. అది నాకు ప్రతి నిమిషం గుర్తుంది అని తెలియజేశారు.
చదవండి : Viral Video: వీరికి భూమిమీద నూకలు ఉన్నాయి.. అందుకే బతికి బయటపడ్డారు