హైదరాబాద్ (Hyderabad) జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో దారుణం జరిగింది.మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను నడిరోడ్డుపై వివస్త్ర (Vivastra) చేశాడు. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య (Pedda maraiah) కూలీ. తాగుడుకు బానిసగా మారిన ఆయన పీకల దాకా తాగాడు. ఇక తన తల్లితో కలిసి రాత్రి 8:30 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక యువతి దుకాణం నుంచి ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసిన మారయ్య.. కామంతో రగిలిపోయాడు.ఆమెపై చేయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.
కోపంతో అతన్ని దూరంగా నెట్టేసింది.దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. ఆమె దుస్తులను లాగి చింపేశాడు. మారయ్య తల్లి కనీసం కొడుకును అడ్డుకోలేదు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించగా, ఆమెపై కూడా మారయ్య దాడి చేసేందుకు యత్నించాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి నగ్నంగానే రోడ్డుపైనే రోదిస్తూ కూర్చుంది. కనీసం చుట్టుపక్కల వారు స్పందించలేదు. అతను వెళ్లాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్‌నగర్ పోలీసుల (Jawaharnagar Police) కుసమాచారమిచ్చారు.దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు (Investigate) జరుపుతున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.