వైజాగ్(Vizag)లో హనీట్రాప్ కలకలంరేపింది. ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్తాన్ మహిళ హనీట్రాప్‌లో పడిపోయాడు.సోషల్ మీడియాలో పరిచయమైంది.ఈ క్రమంలో కానిస్టేబుల్ (Constable) కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. 2002 నుంచి కపిల్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు రక్షణ రంగంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)లో విధులు నిర్వర్తించాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థ(Pakistan’s intelligence agency)కు చేరినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కపిల్ మొబైళ్లను స్వాధీనం చేరుకొని ఫోరెన్సిక్ విచారణ(Forensic investigation)కు పంపారు. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియా ద్వారా కపిల్ కుమార్(Kapil Kumar)తో పరిచయం పెంచుకున్న తమిషా.. వ్యవహారాన్ని న్యూడ్ వీడియో కాల్స్ వరకూ నడిపింది. అంతటితో ఆగిందా.. ఆపై రహస్యంగా కపిల్‌ను ఓ రూమ్‌లో కలిసింది. మెల్లగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్నంతా రాబట్టింది. అయితే కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు (superiors) అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతే విషయం మొత్తం బయటకు వచ్చింది. మొత్తానికి కీలక సమాచారం పాక్ గూఢచార సంస్థకు చేరి ఉంటుందని అధికారుల అనుమానం. కపిల్ మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని దానిని సీఐఎస్ఎఫ్ (CISF) ఫోరెన్సిక్ విచారణకు పంపించి ఆపై అతడిపై అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు.