»Indian Busker Sings Pehla Nasha On Londons Oxford Street
London ఆక్స్ ఫర్డ్ వద్ద నేల మీద కూర్చొని పాట, వైరల్
లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ వద్ద సింగర్ విషు పెహ్ల నషా అంటూ పాట పాడారు. అక్కడ ఉన్న జనం అందరూ పాటను విని ఎంజాయ్ చేశారు. మరికొందరు ఆయనతో గొంతు కలిపారు.
Indian busker sings Pehla Nasha on London’s Oxford Street
Pehla Nasha on London’s Oxford Street: ఇప్పుడు ట్రెండ్ మారింది. జనం ఎక్కడ ఉంటే అక్కడికి మార్కెట్ వెళుతోంది. అలాగే పాటలు, కచేరీ, డ్యాన్స్ కూడా చేస్తుంటారు. లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ (Oxford Street) వద్ద.. కింద కూర్చొని సింగర్ విషు ‘పెహ్ల నషా’ (Pehla Nasha) అంటూ పాట పాడారు. 1992లో వచ్చి జో జీతా వోహి సికందర్ మూవీలోని పెహ్ల నషా సాంగ్.. ఆ పాటను ఆక్స్ ఫర్డ్ ముందట.. విద్యార్థులు, వారి పేరంట్స్ ముందు పాడగా.. వారు కూడా గొంతు కలిపారు. ఆ వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియో కింద సింగర్ ఇలా రాశారు. ‘ఉదిత్ నారాయణ (udit narayana) ట్యూన్‌ను లండన్ వీధుల్లో ప్రజలు ఎంత చక్కగా కూర్చొని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు అని’ విషు రాసుకొచ్చారు. విషు చుట్టూ జనం గుమికూడి.. వారు కూడా గొంతు కలిపారు. ఆ వీడియోను ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇప్పటికే 17.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల కామెంట్లతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది.
ఈ పాట ప్రతీ సందర్భంలో హిట్ అవుతోందని ఒకరు.. ఇది తనకు చాలా మంచి అనుభవం అని మరొకరు, వండర్ ఫుల్ (wonderful vocie) వాయిస్ అని మరొకరు ప్రశంసలు కురిపించారు. ఈ పాటను 30 మంది కన్నా తక్కువ మంది ఉన్నప్పుడు.. ఆఫీసులో (office) పాడానని, తర్వాత ఇప్పుడే గళం అందుకున్నానని చెప్పారు. తన చేతులు వణుకుతున్నాయని, పాట ప్రత్యేకమైందని అంటున్నారు. అతను చక్కగా పాడారు.. నేల మీద పాటడం గ్రేట్ అని.. ఇద్దరు చిన్నారులు వెనక ఉండటం కూడా రేర్ అని వివరించారు. చాలా మంది హార్ట్, ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు.