Hero Ajith, Shalini: విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట?
సినీ సెలబ్రిటీల(Cine Celebrities) జంటలు ఫ్యాన్స్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు అదే రంగంలోని వారినే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో ఉండే మరికొందరు మాత్రం విడాకులు(Divorse) తీసుకుని విడిపోతున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, అలాగే తమిళంలో ధనుష్-ఐశ్వర్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి మరో జంట చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తమిళ హీరో తలా అజిత్(Ajith)కు సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ మామూలుగా లేదు. ఆయన ఏ సినిమా చేసినా భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధిస్తుంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగకు ‘తెగింపు’ అనే డబ్బింగ్ సినిమాతో అజిత్(Ajith) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత తన నెక్ట్స్ మూవీని మొదలు పెట్టి జోరుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇలాంటి టైమ్ లో అజిత్ విడాకులు(Ajith Divorse) తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
అజిత్(Ajith) తన భార్య షాలిని(Shalini)తో విడాకులు తీసుకుంటున్నాడని తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. గత 21 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్స్ విడిపోతున్నారని తెలిసి అందరూ నోటిమీద వేలేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ జంట మధ్య పలు విబేధాలు ఎక్కువయ్యాయని, మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
అంతేకాకుండా ఇలాంటి టైమ్ లోనే దర్శకుడు రమేష్ ఖన్నా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అజిత్(Ajith), షాలినీ(Shalini)లు ప్రేమించి పెళ్లి చేసుకునే టైంలో తాను వద్దని చెప్పానని, అయినా వినకుండా వారు పెళ్లి చేసుకున్నారన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమేనని, అయితే వారు విడిపోతారనే తాను అనుకోవడం లేదన్నారు. ఇన్ని రోజులు ఎలా గుట్టుగా సంసారం చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే వారి జీవితం సాగిపోవాలని డైరెక్టర్ రమేష్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం ఆ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యల వల్ల నెటిజన్లు నిజంగానే హీరో అజిత్(Ajith) విడాకులు తీసుకోబోతున్నారని నమ్ముతున్నారు.