సెలబ్రెటీ క్రికెట్ లీగ్ రెండో సీజన్లో (Hero Vishal) హీరో విశాల్‌తో తనకు విభేదాలు వచ్చాయని నటుడు అబ్బాస్ గుర్తుచేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విశాల్ నా గురించి ఇతరులతో అబద్ధాలు చెప్పేవాడు. అతని మాటలకు ఎంతో బాధపడ్డా. మర్యాద దక్కకపోవడంతో ఆటను వదిలేశాను. సినీ పరిశ్రమ(Film Industry)లో మనస్పర్థలు కామన్ కాబట్టి అతడిని నేను క్షమించాను. ఎదురైతే హాయ్ అని పలకరిస్తా. కానీ సన్నిహితంగా ఉండలేను’ అని వెల్లడించారు.ప్రేమదేశం’ సినిమాతో అప్పటి యూత్‌లో విశేష క్రేజ్ సంపాదించుకున్న నటుడు అబ్బాస్ (Abbas). ఆ తర్వాత, ‘రాజహంస’, ‘రాజా’, ‘నీ ప్రేమకై’, ‘శ్వేతనాగు’, ‘నరసింహ’, ‘అనసూయ’ తదితర సినిమాలో విభిన్న పాత్రలు పోషించిన ఆయన 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. కొన్ని రోజుల క్రితం స్వదేశానికి (Chennai) తిరిగొచ్చిన అబ్బాస్ కోలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిల్లోని ఓ చిట్‌చాట్‌లో పలువురు తమిళ హీరోలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సీసీఎల్) విషయంలో నటుడు విశాల్ (Vishal)తో విభేదాలు వచ్చినట్టు తెలిపారు.విశాల్ అన్న మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డా. అతడు ఏదో ఒక రోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని, రియలైజ్ అవుతాడని అనుకున్నాని హీరో అబ్బాస్ అన్నారు. విజయ్ (Vijay) చాలా సరదా వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఎందులోనూ హద్దులు దాటడు. అతడి గత చిత్రాలను నేను ఇష్టపడను. కానీ, ఇప్పుడు విజయ్‌ని అభిమానిస్తున్నా. అతడి కొత్త సినిమాల్లో సందేశం ఉంటుంది’’ అని అన్నారు.