స్టోరీ బాగుంటే చాలు.. థియేటర్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కంటెంట్ ఉండాలే కానీ.. స్టార్ కటౌట్లు కూడా లేకుండానే మూవీలు రికార్డులు తిరగరాస్తున్న రోజులివి. ఓటీటీ ప్లాట్ (OTT PLOT) ఫామ్స్ విస్తృతి పెరిగిన తర్వాత క్రియేటివిటీతో కూడిన సబ్జెక్టులు తెరపైకి వస్తున్నాయి. వెబ్ సిరీస్ (Web series) ల రూపంలో అద్దిరిపోయే కంటెంట్.. ప్రేక్షకుల చేతివేళ్లకు అందుబాటులో ఉంటోంది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
పంచాయత్(Panchayat) : 2020లో వచ్చిన ఈ సిరీస్ మంచి జనాదరణ పొందింది. దీపక్ కుమార్ మిశ్రా (Deepak Kumar Mishra) డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. ఈ చిత్రానికి 29 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ లలో టాప్-5 లో ఉంది.
మీర్జాపూర్(Mirzapur) : ఈ వెబ్ సిరీస్ 2018లో విడుదలైంది. యూపీ(UP)లోని మీర్జాపూర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ యూపీ ప్రతిష్టను దెబ్బతీస్తోందంటూ వివాదాస్పదమైంది. రెండు సీజన్లుగా వచ్చింది. ఈ సిరీస్ కు 32 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న వెబ్ సిరీస్ ల లో టాప్-4 లో ఉంది.
ఆశ్రమ్ (Ashram) : ఇది కూడా క్రైమ్ డ్రామా. ప్రకాష్ ఝా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ 2020లో ఫస్ట్ సీజన్ వచ్చింది. ఇప్పటి వరకూ 3 సీజన్లు వచ్చాయి. బాబీ డియోల్, ఈషా గుప్తా వంటి నటి, నటులు నటించిన ఈ సిరీస్ 34.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సిరీస్ టాప్-3 స్థానం దక్కించుకుంది.
రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ (Rudra – The Edge of Darkness) : ఈ సిరీస్ 2022లో విడుదలైంది. ఇదొక క్రైమ్ డ్రామా. “లూథర్” అనే బ్రిటీష్ సిరీస్ ఆధారంగా నిర్మించారు. రాజేష్ మపుస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ విశేషంగా ఆకట్టుకుంది. 35 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కాయి. ఈ సిరీస్ టాప్-2లో ఉంది.
ఫర్జీ(Farzi) : బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) నటించిన తొలి వెబ్ సిరీస్ ఫర్జీ (FARZI). ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్-డీకే ద్వయం ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసింది. నకిలీ కరెన్సీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ లలో నెంబర్ 1గా నిలిచింది. ఈ సిరీస్ కు 38 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.