Chiranjeevi: వెబ్ సిరీస్‌కు సైన్ చేసిన మెగాస్టార్?
గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ వెండి తెరను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్గా మెగాస్టార్ ఓటిటి కంటెంట్‌కు సైన్ చేశాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
Chiranjeevi:ప్రస్తుతం ఓటీటీ హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడా లేని కంటెంట్ ఓటీటీలో కనిపిస్తోంది. సినిమాలకు మించిన బడ్జెట్‌తో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి ప్రముఖ ఓటీటీ సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఓటీటీ ఎంట్రీ ఇచ్చేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంటకేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. నాగ చైతన్య ధూత సిరీస్‌తో అదరగొట్టాడు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ ఎంట్రీ కోసం చూస్తున్నారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. కాకపోతే సాలిడ్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఈ మధ్యలో మెగాస్టార్ ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం.. చిరంజీవి ఓ వెబ్‌సిరీస్‌కు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఏ ఓటీటీ సంస్థకు చిరు కమిట్ అయ్యాడు? ఎలాంటి కంటెంట్‌తో రాబోతున్నారనే? విషయంలో క్లారిటీ లేదు. అసలు చిరు ఓటీటీ ఎంట్రీ.. అనే న్యూస్‌లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. కానీ మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ అంటే, గట్టిగానే ఉంటుంది. మరి దీని పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.