ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కార్యక్రమం మార్చి 12 న గ్రాండ్‌గా జరగనుంది. కానీ 20 రోజుల ముందే అమెరికాకి వెళ్లిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్. దాంతో.. మరి ఇంత అడ్వాన్స్‌గా చరణ్ ఫారిన్ టూర్ వేయడమేంటనే డౌట్ అందరిలోను కలిగింది. అయితే అసలు మ్యాటర్ వేరే ఉంది. చెర్రీ ఒక్క ఆస్కార్స్ కోసం అమెరికాకి వెళ్లలేదు.. అక్కడ అరుదైన రికార్డులు క్రియేట్ చేయడానికి వెళ్లాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కార్యక్రమం ఫిబ్రవరి 24 జరగనుంది. ఈ ఈవెంట్లో ప్రజెంటర్‌గా రామ్ చరణ్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేడుకలో పలువురు హాలీవుడ్ స్టార్స్‌తో వేదిక పంచుకోనున్నాడు చరణ్. లాగే హెచ్.సి.ఎ విజేతలలో ఒకరిని చరణ్ చేతుల మీదుగా అవార్డు ఇవ్వనున్నారు. దాంతో ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఇదిలా ఉండగానే మరో న్యూస్.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ రామ్ చరణ్ అంటు ట్రెండ్ చేస్తున్నారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా.. పాపులర్ అమెరికన్ టీవీ షో నుంచి చరణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.’ గుడ్ మార్నింగ్ అమెరికా’ అనే పాపులర్ టీవీ షో అమెరికాలో చాలా ఫేమస్. ఈ షోకు రామ్ చరణ్ హాజరు కానున్నారు. అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు రామ్ చరణ్ పాల్గొన్న ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దాంతో టాలీవుడ్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరోగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో ఇండియా నుంచి షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రా మాత్రమే పాల్గొన్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయిందని చెప్పొచ్చు.