ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌తో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా సమాచారం.
Ram Charan: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం ఎవ్వరికీ తెలియదు. శంకర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చేస్తున్నాడు చరణ్ (Ram Charan). ఉప్పెన తరువాత.. ఎన్టీఆర్‌తో (ntr) సినిమా చేయాలనుకున్న బుచ్చి బాబు.. ఫైనల్‌గా రామ్ చరణ్‌ను (Ram Charan) మెప్పించాడు. ఈ సినిమా రంగస్థలం రేంజ్లో ఉంటుందని.. ఇప్పటికే చెప్పేశాడు చరణ్ (charan). ప్రస్తుతం బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు.
ఆర్సీ 16లో స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకోవాలని చూస్తున్నాడు. హీరోయిన్గా జాన్వీ కపూర్ లేదా మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో.. సాయిపల్లవి అయితే కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నాడట బుచ్చిబాబు. ఇప్పటికే సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా నాగచైతన్య, చందు మొండేటి ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది సాయి పల్లవి. ఇక ఇప్పుడు చరణ్‌తో సినిమా ఓకే చెప్పిందని టాక్. త్వరలోనే దీని పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే.. సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోను విలన్‌గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు. మొత్తంగా ఆర్సీ 16 అంతకుమించి అనేలా తెరకెక్కబోతోంది.