ప్రస్తుతం అన్‌స్టాపబుల్ మూడో సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి ప్రమోషన్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవగా..ఇప్పుడు యానిమల్ చిత్ర యూనిట్‌తో సెకండ్ ఎపిసోడ్ రాబోతోంది. తాజాగా యానిమల్ ప్రీమియర్ డేట్ లాక్ చేశారు.
అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగ..ప్రస్తుతం రణబీర్ కపూర్(Ranbir Kapoor)హీరోగా రష్మిక మందన(Rashmika Mandanna) హీరోయిన్గా ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేసేందుకు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. అందులో భాగంగా.. తెలుగులో అన్‌స్టాపబుల్ టాక్ షోకి వచ్చింది యానిమల్ టీం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి.. కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ షోలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు.
తాజాగా ఆహా వారు యానిమల్ షో ప్రీమియర్ డేల్ లాక్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 3(Unstoppable 3)లిమిటెడ్ ఎడిషన్‌లో సెకండ్ ఎపిసోడ్‌గా రానున్న యానిమల్ టీం టాక్ షోని నవంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్కి తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రోమో కట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే.. ఇప్పటికే యానిమల్ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అదిరిపోయాయి. రీసెంట్గా తండ్రి మీద ప్రేమను నెక్స్ట్ లెవల్ అనేలా థర్డ్ సాంగ్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. అంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ కూడా అదిరిపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి చేస్తున్న స్ట్రెయిట్ సెకండ్ ఫిల్మ్ ఇదే. అందుకే యానిమల్ పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సారి సందీప్ రెడ్డి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి మరి.