టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్‌తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.
ఎంఎం.కీరవాణి(MM.Keeravani) తనయుడు శ్రీసింహ కోడూరి(Srisimha Koduri) మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు భాగ్ సాలే(Bhaag Saale teaser) అంటూ రానున్నాడు. ఈ మూవీ ఓ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీకి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అన్ని సినిమాల్లాగా సాధారణంగా కాకుండా ఈ సారి కొత్త రకంగా కార్టూన్ రూపంలో టీజర్ విడుదలైంది. భాగ్ సాలే టీజర్ లో టీజర్ ను మరో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో సిద్దూ జొన్నలగడ్డ(Hero Siddu Jonnalagadda) చేత చెప్పించారు.
‘భాగ్ సాలే’ మూవీ టీజర్:
టీజర్(Teaser) అంతా ఓ రింగు స్టోరీతో నడుస్తుంది. కార్టూన్ క్యారెక్టర్లతో స్టోరీ చూపించారు. చివరల్లో ‘భాగ్ సాలే’ (Bhaag Saale Movie) అంటూ హీరో ఎంటర్ అవుతాడు. టీజర్ మొదట్లో సిద్దూ చెప్పిన స్టోరీ స్టైల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కొన్ని వందల ఏళ్ల కిందట భూస్వామికి భూమిలో దొరికిన వజ్రం ఆ తర్వాత నిజాం వరకూ ఎలా చేరుతుందో, ఆ రింగుకు మూవీలోని హీరోకు లింకేంటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.
ఈ టీజర్ తోనే మూవీపై మేకర్స్ అంచనాలు పెంచారు. సిద్దూ(Hero Siddu Jonnalagadda) స్టోరీ చెప్పిన విధానం చాలా ఫన్నీగా ఉంది. గతంలో దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేయగా మళ్లీ అలాంటి డిఫరెంట్ జానర్‌తోనే శ్రీసింహ కోడూరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భాగ్ సాలే పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని ప్రణీత్(Praneeth) డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో నేహా సోలంకి హీరోయిన్గా నటిస్తోంది. కాల భైరవ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. జులై 7న ఈ సినిమా విడుదల కానుంది.