కోనసీమ: ఉప్పలగుప్తం(మం) ఎస్.యానం గ్రామానికి చెందిన క్రేన్ ఆపరేటర్ పెయ్యల విజయ్ కుమార్ (40) యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఎస్సై SK జానీ బాషా తెలిపారు. అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మృతి చెందాడన్నారు. కాకినాడలో క్రేన్ ఆపరేటర్ పనిచేస్తున్న విజయ్ కుమార్ కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.