MNCL: పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని నెన్నెల సర్పంచ్ ఇబ్రహీం అన్నారు. బుధవారం నెన్నెల మండల కేంద్రంలోని పలు వార్డ్ లలో ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన పారిశుధ్య పనులను పంచాయతీ సెక్రెటరీ సురేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని కాలనీవాసులకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.