»Devara Big Surprise Devara New Release Date Fixed
Devara: బిగ్ సర్ప్రైజ్.. ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
అనుకున్నట్టే.. దేవర పోస్ట్‌పోన్ అయిపోయింది. తాజాగా బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. అయితే.. దేవర వెనక్కి వెళ్తుందని అనుకున్నారు కానీ.. మరీ ఇంత వెనక్కి వెళ్తుందని అనుకోలేదంటున్నారు అభిమానులు.
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకుమించి అనేలా దేవర సినిమా చేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఊర మాస్ సినిమా చేస్తున్నారు కొరటాల శివ, ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అయితే.. ఈ మధ్య దేవర సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు షూటింగ్లో గాయాలు అవడంతో.. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్‌లో ఉంది. ఈ నెల చివర్లో తిరిగి దేవర షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. సైఫ్ లేని సన్నివేశాల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి కంటే కాస్త డిలే అవడం.. పైగా సమ్మర్లో ఏపి ఎలక్షన్స్ ఉండడంతో.. దేవర సినిమాను వాయిదా వేశారు.
యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా.. ఏప్రిల్ 5 నుంచి దేవర ఏ డేట్‌కు వెళ్తుంది? అని ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే.. దసరా బరిలోకి దూసుకొచ్చాడు దేవర. లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ.. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దసరా సెలవులు దేవరకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. గురువారం రోజు దేవర రిలీజ్ కానుంది. దీంతో లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. ఇక కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా.. సాలిడ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
భయానికే భయం పుట్టేలా అక్డోబర్ 10న ఎలక్ట్రిఫైయింగ్ సునామి వస్తుందంటు ప్రకటించారు. ఈ పోస్టర్లో యంగ్ టైగర్ లుక్ మామూలుగా లేదు. యుద్ధానికి సై అన్నట్టుగా అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు ఎన్టీఆర్. దీంతో దేవర అంతకుమించి అనేలా ఉంటుందని మరోసారి చెప్పేశాడు కొరటాల. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.