Senior Congress leader Mallu Bhatti Vikramarka's tweet went viral
Bhatti Vikramarka : ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భర్తీ గురించి కావాల్సిన నిధులను సమకూరుస్తామన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ది చెందాలని కోరుకునే వాళ్లమని ఒక ప్రాంతం ఒక ఏరియా మాత్రమే డెవలప్ కావాలని కోరుకునే వాళ్లం కాదన్నారు. గత ప్రభుత్వం దళితబంధుకు 17,700 రూపాయల కోట్లు కేటాయించి ఒక్క పైస కూడ విడుదల చేయలేదన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అభయహస్తం కోసం విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని మంత్రి తెలిపారు. మార్గ దర్శకాలు పూర్తి కాగానే నిధుల కేటాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధన్యత ఇస్తుంది. సామాజిక తెలంగాణ నిర్మాణమే ద్యేయంగా మా ప్రభుత్వం పని చేస్తుందని భట్టి సూచించారు.
పాత బస్తీలో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. రాష్ట్రానికి ధరణి గుది బండగా మారింది. దీనిని సరిచేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసింది. ప్రక్షాళన చేసి సరి చేయడానికి కమిటి వేశాము. కమిటి నుంచి నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాము. ధనిక రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకున్నారు. మరీ 2018 నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ క్లియర్ చేయకపోవడం దారుణం. రెసిడెన్షియల్ పాఠశాలలకు భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించం. అందరు తెలంగాణ బిడ్డలే. మాకు ఏలాంటి పక్షపాతం లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను సమానంగానే చూస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫెడర్ స్పూర్తి ఉంది. తప్పని సరిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తాం. బాగా పన్నులు చెల్లించే రాష్ట్రాలకు దానికి అనుగుణంగానే కేంద్రం నిధులు కేటాయించాలి. హైదరాబాద్ లో కబ్జాకు గురైన భూములను కాపాడుతామన్నారు.