»Israel Attack Lebanon Flames Of Gaza Violence Reach Lebanon 10 People Died In Israeli Air Attack
Israel Attack Lebanon: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 10మంది మృతి
ఫిబ్రవరి 14న లెబనాన్ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అనేక వైమానిక దాడులు చేసింది.
Israel Attack Lebanon: ఫిబ్రవరి 14న లెబనాన్ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అనేక వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 10 మంది చనిపోయారు. దక్షిణ లెబనాన్‌లో బుధవారం జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. శిధిలాల నుండి ఒక చిన్నారిని సజీవంగా బయటకు తీశారని లెబనీస్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం జరిగిన దాడుల్లో మొత్తం 10 మంది మరణించారు. అందులో 8 మంది పౌరులేనని హిజ్బుల్లా చెప్పారు.
నబాతిహ్ ప్రాంతంలోని మూడు అంతస్తుల అపార్ట్మెంట్ భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. దాడిలో ఈ భవనం పూర్తిగా ధ్వంసమైంది. హమాస్ గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 29 వేల మంది చనిపోయారు. హింస ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
అక్టోబర్ 14 దాడిలో చాలా మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారని హిజ్బుల్లా పేర్కొంది. ఇంతలో, అమాయక పౌరుల మరణానికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించవలసి ఉంటుందని హిజ్బుల్లా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య హింస ప్రారంభమైనప్పటి నుండి లెబనీస్ వైపు 254 మంది మరణించారు. వీరిలో 38 మంది పౌరులు ఉన్నారు, ఇజ్రాయెల్ వైపు 10 మంది సైనికులు, ఆరుగురు పౌరులు మరణించారు.