శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగంలో విధి నిర్వహణలో అలసత్వం వహించిన 10 మంది సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ H. కూర్మారావు మంగళవారం మెమోలు జారీ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సిబ్బంది పని తీరుపై సమీక్షించిన సమయంలో వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.