»Droupadi Murmu Presidents Assent To Anti Paper Leaks Bill
Droupadi Murmu: పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
Droupadi Murmu: జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ‘పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024’ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. అయితే దీన్ని నిన్న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
ఇకపై ప్రభుత్వ ప్రవేశ పరీక్షలన్నింటిలో అక్రమాలను అరికట్టడం, అవకతవకలపై దర్యాప్తు చేయడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపారు. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సర్కార్ నిర్ణయించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లు ఓపెన్ చేసిన గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది.
యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ లాంటి ఎంట్రన్స్ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్లేనన్నారు.