PDPL: రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి స్వయంగా డివిజన్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 60వ డివిజన్లో ఆయన ఇవాళ పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ నాయకుడు అబ్బాస్ యాదవ్ కాలనీ సమస్యలను వివరించగా.. తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.