AP: కృష్ణా జిల్లా చల్లపల్లి బాణసంచా పేలుడులో ఆరుగురు పోలీసులకు గాయాలు కాగా.. మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు సుభాష్, కొల్లు రవీంద్ర, ఎస్పీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కానిస్టేబుల్ అబ్దుల్లా 50 శాతం కాలి.. పరిస్థితి విషమంగా ఉందని, మరో ఇద్దరికి 20 శాతం కాలి.. కంటిలో పొర దెబ్బతిందని వైద్యులు వెల్లడించారు.