బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలను వేగవంతం చేశారు. డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు ‘డ్రగ్స్ వద్దు–ఈగల్ క్లబ్స్’ పేరుతో ప్రత్యేక ప్రచార బోర్డులను ఆవిష్కరించారు.