గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరామే?
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆర్సీ 16 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో రాబోతోంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన వారిని ఆర్సీ 16లో తీసుకోవడానికి టాలెంట్ హంట్ జరుగుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన డీటెల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లేటెస్ట్గా బుచ్చిబాబు ఓ వీడియో రిలీజ్ చేశాడు. విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయని.. నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిబాబు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో చర్చలు జరుగుతునే ఉన్నాయి. పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించినప్పటికీ అధికారిక ప్రకటన బయటికి రాలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఆర్సీ 16 హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న జాన్వీ కపూర్.. ఆర్సీ 16లో దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. రీసెంట్గా చిత్ర యూనిట్ జాన్వీని సంప్రదించగా.. ఒకే చెప్పినట్లుగా సమాచారం. త్వరలోనే దీని పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్ రొమాన్స్ చేసిన హీరోయిన్‌తో చరణ్ కూడా రొమాన్స్‌కు రెడీ అవుతున్నాడనే చెప్పాలి.