Pushpa 3: పుష్ప 3 పై సాలిడ్ బజ్.. టైటిల్ కూడా ఫిక్స్?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప2కి కొనసాగింపుగా పార్ట్ 3 కూడా వస్తోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు.. పార్ట్ 3 టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Pushpa 3: అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప.. ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప.. ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు. కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. పుష్ప3 రావడం పక్కా అనే లేటెస్ట్ బజ్ వైరల్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పుష్ప సినిమా కేవలం రెండు భాగాలతో ఆగేలా లేదట. థర్డ్ పార్ట్‌కు పుష్ప.. ది రోర్ టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ, సుక్కు, మైత్రి మూవీ మేకర్స్ థర్డ్ పార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయారట. రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన సుకుమార్.. నెక్స్ట్ షెడ్యూల్‌ని జపాన్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అక్కడే పుష్ప2 క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయనున్నారట. దీంతో పుష్ప 2కి ఎండింగ్.. పుష్ప 3కి బిగినింగ్ జపాన్ నుంచే ఉండొబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఫస్ట్ పార్టులో పుష్పరాజ్ ఎలా ఎదిగాడు? అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? అనేది చూపించబోతున్నాడు. ఇక మూడో భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్పరాజ్ చేసే యుద్ధం ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. దీంతో పుష్ప3 మామూలుగా ఉండదని అంటున్నారు. అయితే.. అసలు పుష్ప3 ఉంటుందా? లేదా? అనేది తెలియాలంటే.. అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. లేదంటే, పుష్ప2 రిలీజ్ అయ్యే వరకు, అంటే ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.