TG: గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.247.94 కోట్ల నిర్ధిష్ట నిబంధనలు లేని నిధులను విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి పనుల కోసం వాడుకోవచ్చు. అలాగే గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ (బహిరంగ మలవిసర్జన) ఫ్రీగా మార్చడానికి, చెత్తాచెదారం క్లీన్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకునే వీలుంటుంది.